VIDEO: అయినవిల్లి‌లో యథేచ్చగా మద్యం అక్రమ విక్రయాలు

VIDEO: అయినవిల్లి‌లో యథేచ్చగా మద్యం అక్రమ విక్రయాలు

కోనసీమ: అయినవిల్లి మండలంలో బెల్ట్‌ షాపులు యథేచ్ఛగా నడుపుతున్నారు. గ్రామాలలోని వీధికో షాపు వంతున మద్యం విక్రయాలు సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మండలంలో దాదాపు 54 బెల్ట్‌ షాపుల ద్వారా అక్రమ మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.