మహరాజ్‌గంజ్‌లో అగ్ని ప్రమాదం

HYD: అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి మహరాజ్ గంజ్‌లోని ఓ భవనంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మూడో అంతస్తులో మొదలైన మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మూడో అంతస్తులో చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. 6 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తీసుకొస్తున్నారు.