పేకాట దాడిలో నలుగురు అరెస్ట్
సత్యసాయి: తనకల్లు మండలం కోటూరు గ్రామ పరిసరాల్లో ఎస్సై గోపి నేతృత్వంలో పోలీసులు శుక్రవారం పేకాట దాడి నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,450 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు.