రేవేంద్రపాడులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

రేవేంద్రపాడులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

GNTR: దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మంగళవారం ప్రారంభమైంది. ఎంపీపీ షేక్ జబీన్, దుగ్గిరాల యార్డు ఛైర్‌పర్సన్ ఉన్నం ఝాన్సీరాణి, తహశీల్దార్ సునీత లబ్ధిదారులకు ఈ కార్డులను అందజేశారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. జూన్ నెలలోపు దరఖాస్తు చేసుకున్న 20,064 మంది అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు.