'మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి'

BHNG: కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూరు మండలాన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.