బెల్ట్ షాపుపై దాడులు.. వ్యక్తి అరెస్టు

బెల్ట్ షాపుపై దాడులు.. వ్యక్తి అరెస్టు

VZM: భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలోని ఓ బెల్ట్‌ షాపుపై ఎక్సైజ్‌ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి 6 మద్యం బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ CI వి.రవికుమార్‌ తెలిపారు. అనధికారంగా మద్యం అమ్మకాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.