BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
BHPL: రేగొండ (M), రూపీరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు ముడతనపెల్లి కుమారస్వామి, మాజీ MLA గండ్ర వెంకట రమణా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర కుమారస్వామికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు సుధాకర్, మాజీ MPTC రమేష్, రాజు, వేంకటేష్, సదాశివచారి, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.