170 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు
SS: నేలకోటలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సంస్కృతి స్వచ్ఛంద సంస్థ, వైదేహి ఆసుపత్రి సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మవరం నియోజకవర్గ బీజేపీ నేత హరీష్ బాబు హాజరై సేవలను పరిశీలించారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ వంటి విభాగాల నిపుణ వైద్యులు సేవలు అందించారు. మొత్తం 170 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేసినట్లు సిబ్బంది తెలిపారు.