'రోలుగుంటలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి'

'రోలుగుంటలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి'

ASR: జీకేవీధి మండలం రోలుగుంట గ్రామంలో మినీ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, కార్యకర్తను నియమించాలని ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు స్థానికులతో కలిసి శుక్రవారం పాడేరు ఐటీడీఏ ఎదుట నిరసన తెలిపారు. గ్రామంలో పీవీటీజీ గిరిజనులకు చెందిన 25 కుటుంబాలు నివసిస్తున్నాయని తెలిపారు. సుమారు 20మంది పిల్లలు ఉన్నారన్నారు.