VIDEO: పొలమూరులో సామూహిక సీమంతాలు
E.G: అనపర్తి మండలం పొలమూరు 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ICDSPD శ్రీదేవి పాల్గొని గర్భిణీలకు సామూహికంగా సీమంతాలు చేశారు. అనంతరం పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. మహిళల ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.