నేడు ఉచిత నేత్ర వైద్య శిబిరం

నేడు ఉచిత నేత్ర వైద్య శిబిరం

పశ్చిమగోదావరి: భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గుడుపూడి అసోసియేషన్ భవనంలో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు చవాకుల నరసింహరావు తెలిపారు. అవకాశాన్ని నేత్ర సమస్యలు ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.