వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని నిరసన

వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని నిరసన

CTR: ముస్లింలకు నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నగరిలో ముస్లిం సోదరులు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. భారత రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బైపాస్ కూడలి నుంచి బస్టాండు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.