ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9లక్షలు స్వాహా

W.G: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళను రూ. 9లక్షలకుపైగా టోకరా వేసిన ఘటన భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న రాణికి తోటి ఉద్యోగి ప్రసాద్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.9 లక్షల నగదును తీసుకొని ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రెహ్మాన్ తెలిపారు.