కొత్త కియా సెల్టోస్ వచ్చేసింది
కార్ల తయారీ సంస్థ కియా తన రెండో జనరేషన్ సెల్టోస్‌ను ఆవిష్కరించింది. గట్టి పోటీ ఉన్న మిడ్‌సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యాధునిక హంగులతో 2026 మోడల్ సెల్టోస్‌ను తీసుకొచ్చింది.ఈ కారు ధరను జనవరి 2న కంపెనీ వెల్లడించనుంది. DEC11 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయని, రూ.25 వేలు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.