బాక్సింగ్ పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులు
నంద్యాల: సికింద్రాబాద్ బొల్లారం ఫుట్ బాల్ గ్రౌండ్‌లో తెలంగాణ బాక్సింగ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓపెన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో నిర్వహించారు. పోటీలలో నంద్యాల జిల్లా క్రీడాకారులు పాల్గొని 15 పతకాలు సాధించారు. బుధవారం పతకాలను సాధించిన క్రీడాకారులను కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అభినందించారు.