VIDEO: రైల్వే స్టేషన్ వద్ద చిరు వ్యాపారుల ఆందోళన

VIDEO: రైల్వే స్టేషన్ వద్ద చిరు వ్యాపారుల ఆందోళన

మహబూబాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టేషన్ పరిసరాల్లో టిఫిన్, పానీపూరీ, జొన్న రొట్టెలు తయారు చేసి జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల వద్ద అధికారులు గ్యాస్ మొద్దులను తీసుకెళ్లారు. దీంతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తీసుకెళ్తారని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవనాధారాన్ని ప్రభావితం చేసేలా ఇలా చేయడం సరైంది కాదని మండిపడ్డారు.