పాక్ ఆర్మీ చీఫ్‌కు జీవితకాలం రక్షణ

పాక్ ఆర్మీ చీఫ్‌కు జీవితకాలం రక్షణ

పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌కు కేసుల నుంచి జీవితకాలం రక్షణ  కల్పించే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు కారణంగా ఆయనపై ఇకపై ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉండదు. మరోవైపు, మునీర్‌కు దేశ రక్షణ బాధ్యతలు అప్పగిస్తూ, ఆయన్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌గా నియమించనున్నట్లు సమాచారం.