మొగల్రాజపురంలో మృతదేహం కలకలం

మొగల్రాజపురంలో మృతదేహం కలకలం

NTR: విజయవాడలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు మాచవరం హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు. మొగల్రాజపురం సత్యసాయి హోటల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని స్థానికుల సమాచారం మేరకు పరిశీలించామని తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 35 నుంచి 40 మధ్య ఉంటుందని చెప్పారు. కాగా, ఈ వ్యక్తి తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.