తుమ్మడిహట్టి DPRకు ఒకే బిడ్
TG: ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పునరుద్ధరణలో భాగంగా తుమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణ నివేదిక రూపకల్పనకు ఒకే టెండర్ వచ్చింది. రూ.9.94 కోట్ల అంచనా వ్యయంతో నీటిపారుదల శాఖ ఈ-ప్రొక్యూర్ మెంట్ ప్రకటన జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా తెరిచిన టెక్నికల్ బిడ్‌లో ఒక్క సంస్థ నుంచే బిడ్ దాఖలైనట్లు గుర్తించింది. సోమ, మంగళవారాల్లో ప్రైస్ బిడ్‌ను తెరవనుంది.