ముగ్గురు విద్యార్థులకు జిల్లా జట్టులో స్థానం

PLD: రొంపిచర్ జడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థినులు చంద్రిక, శ్రీదేవి, శ్రీలక్ష్మి జిల్లా సాఫ్ట్ బాల్ జట్టుకు ఎంపికైనట్లు హెచ్ఎం సుభాని బుధవారం తెలిపారు. సత్తెనపల్లి పరిధిలోని కొమెరపూడి జడ్పీ పాఠశాలలో జరిగిన ఎంపికల్లో వీరు మెరుగైన ప్రదర్శన చేసి జట్టులో స్థానం సంపాదించారు. త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని చెప్పారు.