VIDEO: జీతాలు పెంచాలని మంగళగిరిలో VRAల ధర్నా
GNTR: రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన VRAలు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆటోనగర్ APIIC వద్ద భారీ ధర్నా చేపట్టారు. వీఆర్‌ఏలకు కేవలం రూ.10,500 జీతంతో జీవనం కష్టమని, తెలంగాణ తరహాలో పే-స్కేలు అమలు చేయాలని JAC నాయకులు కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని వారు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.