ఎమ్మెల్యేను నిలదీసిన సర్పంచులు

ఎమ్మెల్యేను నిలదీసిన సర్పంచులు

BHNG: నిధుల కేటాయింపులో పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారంట ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ సర్పంచులు నిలదీశారు. భువనగిరిలో గురువారం నిర్వహించిన 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక' కార్యక్రమం రసాభాసగా జరిగింది. గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు చేయాలని భువనగిరి, వలిగొండ మండలాల బీఆర్ఎస్ సర్పంచులు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు.