పీఎం సూర్యఘర్ యువతి, యువకులకు సువర్ణవకాశం
PPM: పీఎం సూర్యఘర్ కింద సోలార్ పవర్ ప్యానెల్స్ ఇనస్టలేషన్ వెండర్‌గా నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ డా. ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇంటికో పారిశ్రామికవేత్తలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఉత్సాహవంతులైన యువతి, యువకులు సూర్యఘర్‌లో నమోదుచేసుకోవాలన్నారు.