VIDEO: దమ్మన్నపేటలో వృద్ధుడు ఆత్మహత్య
WGL: వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధుడు ఉల్లెంగుల యాదగిరి ఒంటరి జీవితంతో మానసికంగా బాధపడుతూ ఇవాళ గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.