ప్రజల సేవనే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాం: ఎమ్మెల్యే
NTR: జగ్గయ్యపేటలో ఉక్కుకళావేదిక వద్ద టీడీపీ మండల, పట్టణ, క్లస్టర్, యూనిట్, బూత్,వార్డు, గ్రామ, అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను కాపాడలని కోరారు. ఎన్నికైన వారు ప్రజల సేవనే ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.