ఎన్టీఆర్ కాలనీలో తాగునీటి కష్టాలు

ఎన్టీఆర్ కాలనీలో తాగునీటి కష్టాలు

PLD: చిలకలూరిపేట ఎన్టీఆర్ కాలనీలో కొద్దిరోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు, మహిళలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం బీసీ ఐక్య సంఘర్షణ సమితి నేతృత్వంలో మహిళలు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. కాలనీలో నీటి సరఫరాను పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు.