'మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషిచేయాలి'

KDP: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులు రవీంద్రనాథ్ అన్నారు. గుట్కా, సిగరెట్, గంజాయి వంటి వాటికి యువత దూరంగా ఉండాలంటూ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.