బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం
AP: శ్రీకాకుళం జిల్లా పెద్దకేసుపురంలో పిడుగుపాటుకు గురై తల్లీకూతుర్లు మృతిచెందిన ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్, మంత్రి అంచెన్న దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఇటీవలే తండ్రి మధుసూదనరావు, ఇప్పుడు తల్లి కృష్ణవేణి మరణించడంతో. వారి పెద్ద కుమార్తె లక్ష్మీకాంతం కన్నీటి పర్యంతమైంది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి మంత్రి అచ్చెన్న రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు.