అభివృద్ధి పనులకు రూ.29.12 లక్షల నిధులు

Akp: గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలో రూ.29.12 లక్షలను కూటమి ప్రభుత్వం విడుదల చేసినట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. గురువారం అచ్యుతాపురంలో మాట్లాడుతూ.. 2014-2019లో జరిగిన 85 పనులకు మొదటి విడతగా నిధులు విడుదలైనట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదన్నారు.