ప్రధాని మోదీని కలిసిన ఎంపీ

ప్రకాశం: ఢిల్లీలోని బాబాఖరక్ సింగ్ మార్గ్‌లో సోమవారం పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఎంపీ ఫ్లాట్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్లాట్స్‌లో వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పాల్గొన్నారు.