డిప్యూటీ సీఈఓను కలిసిన ఆదివాసీ నాయకపొడ్ ఎంప్లాయిస్

NZB: జిల్లాకు బదిలీపై వచ్చిన జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గాము సాయన్నను జిల్లా ఆదివాసీ నాయకపోడ్ ఉద్యోగ సేవా సంఘం, కార్యవర్గ బాధ్యులు, సభ్యులు, సేవా సంఘం బాధ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం, శాలువాతొ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుట్ట రాజేశ్వర్, శానం పవన్ కుమార్, ధాత్రిక అంజయ్య, లైన్ ఇన్‌స్పెక్టర్ సాయికుమార్ పాల్గొన్నారు.