పిచ్చికుక్క దాడి.. మహిళకు గాయాలు
WGL: పర్వతగిరి మండలం బూరుగుమళ్లలో పిచ్చికుక్క స్వైరవిహారం కలకలం రేపింది. సోమవారం రోడ్డుపై వెళ్తున్న రాపాక బుచ్చమ్మపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామస్తులు తరమడంతో కుక్క కల్లెడ గ్రామం వైపు పారిపోయింది. గాయపడిన మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పిచ్చికుక్క గ్రామాల మధ్య తిరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.