'ఉపాధి కూలీల వేతనాలు మంజూరు చేయాలి'

NDL: ఉపాధి శ్రామికుల వేతనాలు వెంటనే మంజూరు చేయాలని ఏపీ వ్యాకాస జిల్లా నాయకులు ఎం. కర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జూపాడు బంగ్లా మండల కేంద్రంలో పనిచేస్తున్న ఉపాధి కూలీలు చేస్తున్న పనులు పరిశీలించారు. సీపీఎం వామపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.