గిరిజన రైతులకు తీవ్ర నష్టం

ASR: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీని సాగుచేస్తున్న గిరిజన రైతులకు బెర్రీ బోరర్ తెగులు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి, తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం అరకు మండలం పకనకుడి గ్రామంలో కాఫీ రైతులతో నిరసన తెలిపారు.