దాడులతో భయపెట్టాలనుకోవడం అవివేకం: మంత్రి
సత్యసాయి: హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఖండించారు. అమరావతిపై తమ అరాచకాలను ప్రశ్నించినందుకు మీడియా గొంతు నొక్కాలని చూడటం పిరికిపంద చర్య అని విమర్శించారు. దాడులతో భయపెట్టాలనుకోవడం అవివేకమని, ఇలాంటి ప్రవర్తన వల్లే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.