VIDEO: సమస్యలకు నిలయంగా మాంగ్యాతండా
WGL: నెక్కొండ మండలం అజ్మీర మాంగ్యాతండా సమస్యలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని స్థానికులు ఇవాళ నిరసన తెలిపారు. గత 60ఏళ్లుగా తండాలో రోడ్డు సరిగాలేదని, మంచినీరు సైతం లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. GPగా ఏర్పడినప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికల అప్పుడు మాత్రమే నాయకులు, అధికారులు వస్తున్నారన్నారు.