హెచ్చరిక.. రేపు తీవ్ర వడగాలులు

హెచ్చరిక.. రేపు తీవ్ర వడగాలులు

VZM: జిల్లాలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.