నిమ్మ వాగు రహదారి గుంతలతో వాహనదారులకు ఇక్కట్లు
KMM: కామేపల్లి మండలం ముచర్ల గ్రామం నుంచి తిమ్మారావుపేటకు వెళ్లే రహదారి, ముచర్ల దాటిన తర్వాత నిమ్మ వాగు వద్ద గుంతలతో నిండిపోయిందని, దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డును బాగుచేయాలని వారు కోరారు.