‘నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’

‘నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’

GDWL: మెడికల్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ వినయ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం జిల్లలోని పలు మెడికల్ షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫార్మసిస్ట్‌లు అందుబాటులో లేకుండా మందులు విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గడువు ముగిసిన మందులను అమ్మితే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.