PNG విస్తరణపై మంత్రి నాదెండ్ల వివరణ
GNTR: రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను ఆధునికీకరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం నగరాల్లో ఎల్పీజీ వినియోగదారులను పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మళ్లించే చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు.