వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
SDPT: బెజ్జంకి మండలం ముత్తన్నపేట, తిమ్మాయిపల్లి గ్రామాల్లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులికృష్ణ ప్రారంభించారు. రైతులు తమ పంటను ప్రభుత్వానికి విక్రయించి ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ముత్తన్నపేట, తిమ్మాయిపల్లి సర్పంచ్‌లు గుర్రాల అనురాధ, దానబోయిన మల్లయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు.