సీజనల్ వ్యాధులు నియంత్రణకు సమీక్ష సమావేశం
GNTR: మంగళగిరి పరిధిలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై అధికారులు, సచివాలయ ఉద్యోగులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ.. ప్రజారోగ్యం దృష్ట్యా నగరంలోని అన్ని పానీ పూరి బండ్లను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.