ఈతకు వెళ్లిన బాలుడు మృతి

ఈతకు వెళ్లిన బాలుడు మృతి

NDL: బేతంచెర్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన జూలకంటి మణిధర్ ఆదివారం మద్దిలేటి స్వామి దేవస్థానంలోని గుండంలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. బంధువుల శుభకార్యానికి వచ్చిన మణిధర్, సరదాగా గుండంలో ఈతకెళ్లి మునిగిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా కోసం బనగానపల్లి ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.