BREAKING: అందెశ్రీ కన్నుమూత
TG: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లాలాగూడలోని ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా అందెశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.