కార్మికులతో మేయర్ టీ విందు..!
KMM: ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ పునుకొల్లు నీరజ స్వయంగా మహిళా పారిశుధ్య కార్మికులను కలిసి, వారితో టీ విందులో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక మహిళల నుంచి పారిశుధ్యం, మంచినీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.