'లోక్ అదాలత్ లో 3,500 కేసులు పరిష్కారం'

'లోక్ అదాలత్ లో 3,500 కేసులు పరిష్కారం'

MNCL: జిల్లాలోని న్యాయస్థానాల్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లలో 3,500 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య తెలిపారు. ఏడు లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేసి సివిల్ దావాలు, వాహన పరిహారం, క్రిమినల్ కేసులు, సైబర్ క్రైమ్, బ్యాంక్ ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు పేర్కొన్నారు.