300 మంది విద్యార్థులకు అస్వస్థత
AP: SRM యూనివర్సిటీలో సబ్ కలెక్టర్‌తో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో యూనివర్సిటీ క్యాంటీన్‌లో ఆహారం నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ సంజనా మాట్లాడుతూ.. SRM వర్సిటీలో దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారం రోజుల నుంచి రోజుకి 50 మంది అస్వస్థతకు గురి అవుతున్నారన్నారు.