శ్రీశైలం జలాశయం తాజా సమాచారం
NDL: కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి ఇవాళ శ్రీశైలానికి వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 883.50 అడుగుల నీటి మట్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 35,099 క్యూసెక్కులు నీరు జురాలా, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా ప్రవహిస్తోందన్నారు. అటు 35,315 క్యూసెక్కులు నీరు ఎడముగట్టు, భూగర్భ జలవిద్యుత్ కేంద్రాల ద్వారా వెలువడుతోందని పేర్కొన్నారు.