పోలీసు జాగిలం 'సింధు' మృతి
ప్రకాశం: జిల్లా పోలీసు విభాగంలో సేవలందించిన పేలుడు పదార్థాలను గుర్తించే జాగిలం 'సింధు' వయోభారం కారణంగా మృతి చెందింది. సుమారు 9 సంవత్సరాల పాటు సేవలందించిన సింధు మృతి పట్ల జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు విచారం వ్యక్తం చేశారు. సింధు పార్థివదేహానికి పోలీసులు ఘన నివాళులు అర్పించి, పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.