గిరిజన యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ: ITDA

గిరిజన యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ: ITDA

BDK: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ నేడు తెలిపారు. బ్యూటీషియన్, ఎలక్ట్రిషియన్, టైలరింగ్, పుట్టగొడుగుల పెంపకం, జ్యూట్ బ్యాగ్ తయారీ తదితర కోర్సులకు 10 నుండి 45 రోజులపాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.